'జ్యోతిచిత్ర' - సినీ 'మా' లోకం


ప్రియమైన బ్లాగు మిత్రులకు,


ఇది మరో క్రొత్త బ్లాగు...జ్యోతిచిత్ర

ఈ పేరు పెట్టడానికి ముఖ్య కారణాలు మూడు...

1. జ్యోతి చిత్ర - శాన్నాల క్రితం దాకా అంధ్రజ్యోతి వారినుండి వెలువడిన సినిమా పత్రిక.
2. జ్యోతి - సరదా సమాలోచనల పందిరి, షడ్రుచులు, గీతా లహరి అనే బ్లాగులతో చంపే "టెక్నికల్ రంగనాయకమ్మ", శ్రీమతి. జ్యోతి వలబోజుల, మీద ప్రేమ, గౌరవము లతో (నేను, అనిల్ చీమలమఱ్ఱి మరియు జోకులాష్టమి అనే భ్లాగులలో, చాలా టపాలద్వరా మిమల్ని భాధించుటకు ముఖ్య కారణము), ఈ సెప్టెంబరులో, బ్లాగులోకము లో జరిగిన రెండవ పుట్టినరోజు కానుకగా...వారి పేరుతో 'జ్యోతి'చిత్ర...

3.మామూలుగానే బెజవాడ వారికి సినిమా పిచ్చి ఎక్కువ..అందులోనూ నాకు ఇంకా ఎక్కువ..భాషా బేధం లేదు..కన్నడనా,మలయాళమా, కాష్మీరమా, ఇంగ్లీసైనా, హిందీ అయినా, హింగ్లీషైనా (హింది + ఇంగ్లీష్) .. ఏదైనా...రఢీ... ఆవిధంగా చాలా సినిమాలనే చూసాను..ఈ విషయంలో నాతో పోటీ పడలేరు అని ఘంటాపధంగా మీ కంప్యూటర్ మానిటర్ మీద కొట్టి మరీ చెప్పగలను.. అందులో కొన్ని మాంఛివి, తుస్సు లు , ఢాం లు కూడా ఉన్నాయి...వాటిని మీతో పంచుకుందామని...ఈ ప్రయోగం...
ఆదరిస్తారు కదూ...
మీ

అనిల్ చీమలమఱ్ఱి

4 Responses to "'జ్యోతిచిత్ర' - సినీ 'మా' లోకం"


మురళీ కృష్ణ (visit their site)

నేనూ ఒకప్పుడు సినిమాలు తెగ చూసేవాణ్ణి - ఒక్క రోజులో ఐదు సినిమాలు కూడా చూసిన రోజులు కూడా వున్నాయి. కాకపోతే గత 9 సంవత్సరాలుగా ఒక్క సినిమా కూడా (ధియేటర్లోకి వెళ్ళి) చూడలేదు.

మీ జ్యోతి చిత్ర లో ఏయే చిత్ర లోకాలు చూపిస్తారో ... ఎదురు చూస్తున్నాను. ఆలస్యం ఎందుకు మొదలు పెట్టండి.


జ్యోతి (visit their site)

అబ్బాయ్ అనిల్...

అప్పుడెప్పుడో ఏడాదికి పైగా అయింది నువ్వు సంసార సాగరంలో మునిగి.ఈమధ్యే పైకి తేలినట్టున్నావు.ఇప్పుడైనా రెగ్యు‍లర్‍గా రాస్తావా? మళ్ళి మాయమైపోతావా?

అవునూ "టెక్నికల్ రంగనాయకమ్మ" ఏంటి?? మధ్యలో ఆవిడెవరు? నాకా పేరు నచ్చలేదు. తీసుకోను గాక తీసుకోను.. నువ్వే ఉంచుకో. రివర్స్ హ్యామరింగా??


Naveen Garla (visit their site)

మార్నింగ్ షో ఎప్పుడు?...


రమణ మూర్తి (visit their site)

Nothing started yet?

Post a Comment

Post a Comment