చంద్రలేఖ

నిర్మాణం : 1943 (కానీ పూర్తి అయినది : 1948)
భాష : తమిళం, హిందీ (ముందుగా తమిళం లో)
ఖర్చు : సుమారు 3 లక్షలు
రాబడి: సుమారు 1 కోటి
నిర్మాత : ఎస్. ఎస్. వాసన్ (జెమినీ పిక్చర్స్)
కధ - టుకీగా:
అనగనగనగా ఒక రాజు, రాణి, వారికి ఏడుగురు కాదు కానీ(అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలిస్తుందేమో లేక కుటుంబ నియంత్రణ ఉందేమో) ఇద్దరు కొడుకులు. పెద్దవాడు వీర్‌సింగ్ (M.K.రాధ) చాలా మంచివాడు, ఇతడె హీరో. చిన్నవాడు (రంజన్) శశాంక్, దుష్టుడు.

రాజు, తన తదనానంతరము, వీర్‌సింగ్ను రాజును చేయాలనే నిర్ణయాన్ని, చిన్నవాదు, వెతిరేకించి, తిరగబది, తన అనునాయునులతో కలసి ఆడవిలోకి పారిపోయి, రాజయ్మ మీద అదపాదడపా దోపిడులు చేస్తుంటాడు, రాజ్యము మీదకి దండెత్తుతూ ఉంటాడు...
ఆక్కడ కట్ చేస్తే,.,

రాజనగరుకు దగ్గరలో 'చంద్ర లేఖ' (T.R. రాజకుమారి) అనే అందమైన యువతి ఉంటుంది...రొటీన్ గానే మన హీరో హీరొయిన్లు ప్రేమించేసుకుంటారు..కానీ..హీరోమాత్రం తన గురించి చెప్పడు..సినిమ చివరలో చెబుతాను అంటాడు..
.
ఇదే సమయములో, విలన్ హీరోయిన్ వాళ్ల ఊరిమీద దండెత్తి, హీరోయిన్ తండ్రిని చంపి, చంద్రలేఖను బంధిస్తాదు..(అందగత్తె కదా...ఆమాత్రం మోహం లేకపోతే ఎట్లా)..(నార్మల్గానే అందగత్తెలు, హీరోయిన్లు తెలివైనవారు కదా...అలాగే మన చంద్రలేఖ కుడా), తను తప్పించుకొంటుంది...చివరికంటా ఇంతే..పట్టుకోవడం, తప్పించుకోవడం...

తమ్ముడి దురాగతాలు ఎక్కువైనాయని, పట్టుకోవడానికి, అన్న అడవి దారి పట్టి, చేతకాక విలన్ చేతిలో అబందీ అవుతాడు...అక్కడ తప్పించుకొన్న చంద్రలేఖ ఇది చూసి, ఒక సర్కస్ వారిలో కలుస్తుంది...

శశాంక్ ఇక్కడ అడవిలో అన్నను..రాజధాని లో తల్లిదండ్రులను బంధించి, సింహాసనము చేజిక్కించుకొని, సర్కస్లో ఉన్న చంద్రలేఖను కుడా బంధిస్తాడు...

అడవిలో ఉన్న వీర్సింగ్ తప్పించుకొని, ఒక యువతిద్వారా, చంద్రలేఖను శశాంక్ తో ప్రేమగా నటించమని చెబుతాడు...చంద్రలేఖ అలానే చేయగా..అమె వినోదార్ధము శశాంక్ సర్కస్ ను ఏర్పాటు చేస్తాడు...ఇదే క్లైమాక్సు..మీరు ఇక్కడినుండి...అర్ధం చేసుకోడి..
రేపు...ఈ చిత్ర విశేషాలు తెలుసుకుందాం..

'జ్యోతిచిత్ర' - సినీ 'మా' లోకం


ప్రియమైన బ్లాగు మిత్రులకు,


ఇది మరో క్రొత్త బ్లాగు...జ్యోతిచిత్ర

ఈ పేరు పెట్టడానికి ముఖ్య కారణాలు మూడు...

1. జ్యోతి చిత్ర - శాన్నాల క్రితం దాకా అంధ్రజ్యోతి వారినుండి వెలువడిన సినిమా పత్రిక.
2. జ్యోతి - సరదా సమాలోచనల పందిరి, షడ్రుచులు, గీతా లహరి అనే బ్లాగులతో చంపే "టెక్నికల్ రంగనాయకమ్మ", శ్రీమతి. జ్యోతి వలబోజుల, మీద ప్రేమ, గౌరవము లతో (నేను, అనిల్ చీమలమఱ్ఱి మరియు జోకులాష్టమి అనే భ్లాగులలో, చాలా టపాలద్వరా మిమల్ని భాధించుటకు ముఖ్య కారణము), ఈ సెప్టెంబరులో, బ్లాగులోకము లో జరిగిన రెండవ పుట్టినరోజు కానుకగా...వారి పేరుతో 'జ్యోతి'చిత్ర...

3.మామూలుగానే బెజవాడ వారికి సినిమా పిచ్చి ఎక్కువ..అందులోనూ నాకు ఇంకా ఎక్కువ..భాషా బేధం లేదు..కన్నడనా,మలయాళమా, కాష్మీరమా, ఇంగ్లీసైనా, హిందీ అయినా, హింగ్లీషైనా (హింది + ఇంగ్లీష్) .. ఏదైనా...రఢీ... ఆవిధంగా చాలా సినిమాలనే చూసాను..ఈ విషయంలో నాతో పోటీ పడలేరు అని ఘంటాపధంగా మీ కంప్యూటర్ మానిటర్ మీద కొట్టి మరీ చెప్పగలను.. అందులో కొన్ని మాంఛివి, తుస్సు లు , ఢాం లు కూడా ఉన్నాయి...వాటిని మీతో పంచుకుందామని...ఈ ప్రయోగం...
ఆదరిస్తారు కదూ...
మీ

అనిల్ చీమలమఱ్ఱి